బీజింగ్, నవంబర్ 27 : ఆఖరి రోజుల్లో తన ఆలనా పాలనా చూసుకోవడానికి అద్దెకో కుమార్తె కావాలని ప్రకటించింది చైనాలోని ఒక వృద్ధురాలు. తనను బాగా చూసుకునే అమ్మాయికి నెలకు రూ.40 వేల జీతంలో పాటు తన వస్తువులు, తన ఫ్లాట్‌ను కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చింది.
హెనన్ ప్రావిన్స్‌కు చెందిన మా అనే ఈ వృద్ధురాలు స్థానిక టీవీ కార్యక్రమంలో నవంబర్ 19న ఈ మేరకు ప్రకటన ఇచ్చిందని ‘సౌత్ చైనా పోస్ట్’ వెల్లడించింది. వాస్తవానికి తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అయితే వారిద్దరిపై ఆధారపడే పరిస్థితులు లేవని తెలిపింది. ప్రస్తుతం తాను ఆస్తమాతో బాధపడుతున్నానని,కూతురి పాత్ర పోషిస్తూ సమర్థంగా సేవలందిస్తూ చూసుకునే వారి కోసం తాను చూస్తున్నట్టు పేర్కొంది.