చైనా మంత్రి అదృశ్యం.. పదవి నుంచి తొలగింపు
నెల రోజులుగా ప్రజలకు కనిపించని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో వాంగ్ ఇని నియమించారు.
బీజింగ్, జూలై 25: నెల రోజులుగా ప్రజలకు కనిపించని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో వాంగ్ ఇని నియమించారు. ఇటీవల వరకు కిన్ గాంగ్ దేశాధ్యక్షుడికి నమ్మకస్థుడిగా ఉన్నారు. కానీ రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అండ్రీ రుడెంకోతో సమావేశమైన తర్వాత గత నెల 25 నుంచి ఆయన ప్రజలకు కనిపించకుండా పోయారు.
ఇటీవల కొన్ని దేశాలతో జరిగిన ద్వైపాక్షిక చర్చలకు ఆరోగ్య కారణాలను సాకుగా చూపి కిన్ గాంగ్ హాజరు కాలేదు. అమెరికాతో సత్సంబంధాలపై ఆయన ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక అమెరికన్ మహిళా జర్నలిస్ట్ ద్వారా ఆయనకు ఒక కొడుకు పుట్టారని, ఆయనను పదవి నుంచి తొలగించారని, ఆయనపై అధికారిక దర్యాప్తు జరుగుతున్నదని ఇటీవల వదంతులు వ్యాపించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

