బీజింగ్, ఆగస్టు 31 : ఆరవ తరం టెలికమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పటంలో చైనా సైంటిస్టులు ముందడుగు వేశారు. ‘ఆల్ ఫ్రీక్వెన్సీ’లో పనిచేయగల ప్రపంచంలోనే మొట్టమొదటి 6జీ చిప్‌ను తయారుచేశారు. ఒక బొటనవేలు గోరు పరిమాణంలో (1.7మిల్లీమీటర్ల మందం, 11మిల్లీమీటర్ల పొడవు) ఉండే 6జీ చిప్‌ను పెకింగ్ వర్సిటీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఇది సెకన్‌కు 100 గిగాబైట్ల కంటే ఎక్కువ వేగాన్ని కలిగివుంటుంది. ఈ సాంకేతిక పురోగతి.. దేశమంతటా వైర్లెస్ స్రెక్ట్రమ్ కవరేజ్‌ని విస్తరించటానికి, గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ ఆధారిత స్థానిక నెట్‌వర్క్‌కు పునాది వేస్తుందని చెబుతున్నారు. మొత్తం స్రెక్ట్రమ్ను కవర్చేసే ఫ్రీక్వెన్సీలో ఈ చిప్ పనిచేయగలదు.