బీజింగ్: ఖండాంతర క్షిపణిని(Intercontinental Missile) ఇవాళ చైనా పరీక్షించింది. ఐసీబీఎంను పసిఫిక్ సముద్రంలో పరీక్షించినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేర్కొన్నది. సముద్ర జలాల్లోకి ఆ క్షిపణి.. డమ్మీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లినట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉదయం 8.44 నిమిషాలకు ఆ మిస్సైల్‌ను లాంచ్ చేశారు. అనుకున్న ప్రదేశంలోని సముద్ర జలాల్లోనే క్షిపణి పడినట్లు రక్షణ కార్యాలయం తెలిపింది. రోటీన్ పద్ధతిలో భాగంగా ఐసీబీఎంను పరీక్షించినట్లు చెప్పారు. ముందుగానే అన్ని దేశాలకు ఈ పరీక్ష గురించి సమాచారం ఇచ్చినట్లు చైనా తెలిపింది. అంతర్జాతీయ చట్టాలు, విధానాల ప్రకారమే పరీక్ష జరిగినట్లు చెప్పింది. ఏ దేశాన్ని టార్గెట్ చేయలేదని, ఎటువంటి లక్ష్యం లేకుండానే పరీక్ష జరిగినట్లు చైనా వెల్లడించింది.