China | బీజింగ్ : అత్యంత శక్తివంతమైన నిఘా శాటిలైట్‌ను చైనాలోని బీజింగ్ సైంటిస్టులు తయారుచేశారు. ప్రపంచంలోనే శక్తివంతమైన స్పై కెమెరాను దీంట్లో అమర్చినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో చక్కర్లు కొట్టే ఈ నిఘా శాటిలైట్‌లోని స్పై కెమెరా.. భూమిపైన వ్యక్తుల కదలికలు, ముఖాల్ని అత్యంత స్పష్టతతో గుర్తించగలదని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వార్తా కథనం తెలిపింది. త్వరలో ఈ శాటిలైట్ ప్రయోగం ఉంటుందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. శాటిలైట్‌లోని ‘ఎస్ఏఎల్’ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ రాత్రీపగలు పనిచేస్తూ, భూమి ఉపరితలానికి సంబంధించి 2డీ, 3డీ చిత్రాలను సృష్టించగలదు.