వాషింగ్టన్: విదేశీ విద్యార్థులపై ఆంక్షలను ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం రోజురోజుకు తీవ్రం చేస్తున్నది. ఇందులో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న వారు, క్లిష్టమైన రంగాల్లో విద్యనభ్యసిస్తున్న వారు సహా కొందరు చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేసే కార్యక్రమాన్ని అమెరికా ప్రారంభిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం వెల్లడించారు.
‘చైనా విద్యార్థుల వీసాలను మా ప్రభుత్వం దూకుడుగా రద్దు చేస్తుంది’ అని ఆయన మంగళవారం ఎక్స్‌లో ప్రకటించారు.