హైదరాబాద్ : పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఇరాన్‌కు ఆయుధాలను (Manpods weapons) సరఫరా చేస్తున్నదన్న అమెరికా ఆరోపణలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అమెరికా నిఘా వర్గాల నివేదికలు ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడింది. తాము ఏ దేశానికి ఆయుధాలు విక్రయించడం లేదని, బాధ్యతాయుతమైన దేశంగా శాంతి చర్చలకే మద్దతిస్తామని చైనా మరోసారి స్పష్టం చేసింది
కాగా, అమెరికాతో భీకర యుద్ధం సాగిస్తున్న ఇరాన్‌కు ‘గగనతల రక్షణ వ్యవస్థ’ను అందించేందుకు చైనా సిద్ధమవుతున్నదట. రాబోయే కొద్ది వారాల్లో అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్‌కు చైనా సరఫరా చేయవచ్చునని యూఎస్ నిఘా వర్గాలు అంచనా వేశాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దీని ప్రకారం, తక్కువ ఎత్తు, దూరం నుంచి దూసుకొచ్చే క్షిపణులను కూల్చటమన్నది ప్రస్తుత యుద్ధంలో కీలకంగా మారింది. ఈ తరహా దాడుల్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘మ్యాన్‌పాడ్స్’ను ఇరాన్‌కు చైనా అందించబోతుందట. సైనికుడు తన భుజంపైన ‘మ్యాన్‌పాడ్స్’ను మోస్తూ క్షిపణులను కూల్చవచ్చు.