బీజింగ్: అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి దౌత్యపరమైన గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా చైనా నిలిచింది. తాలిబన్ ప్రభుత్వం చైనాకు రాయబారిగా నియమించిన బిలాల్ కరిమికి చైనా దౌత్యపరమైన హోదాను ఇచ్చింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ సమాజం నుంచి అఫ్గానిస్థాన్‌ను మినహాయించకూడదని తమ ప్రభుత్వం భావిస్తున్నదన్నారు.