China | వాషింగ్టన్: చైనా భారీ యుద్ధానికి సిద్ధమవుతున్నదని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇందుకోసం డ్రాగన్ దేశం తగినన్ని అణ్వాయుధాలు, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నదని తెలిపింది. పెంటగాన్ నివేదిక ప్రకారం ప్రస్తుతం చైనా దగ్గర 600 అణుబాంబులు, 400 దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులు, 1300 మధ్య శ్రేణి అణు క్షిపణులు ఉన్నాయని పెంటగాన్ తెలిపింది. వీటిని భారత్, ఫిలిప్పీన్స్, జపాన్‌పై ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేసింది.
అణ్వయుధాల నిల్వ కోసం చైనా కొత్తగా మూడు భూగర్భ బంకర్లను నిర్మించిందని చెప్పింది. చైనా తన అణ్వాయుధాలను మరింత ప్రాణాంతకంగా ఆధునీకరిస్తున్నదని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది.