పెషావర్, సెప్టెంబర్ 3: చైనా తమకు ‘అత్యంత ముఖ్యమైన భాగస్వామి’ అని తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ అన్నారు. అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంలో చైనా కీలక పాత్ర పోషించాలని కోరుకొంటున్నట్టు చెప్పారు. అందుకు చైనా కూడా సిద్ధంగా ఉందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉందని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి దేశంలో విస్తారంగా ఉన్న కాపర్ గనులను వినియోగిస్తామన్నారు. చైనా ‘వన్ బెల్ట్, వన్ రోడ్’కు మద్దతిస్తామని చెప్పారు.