బీజింగ్, డిసెంబర్ 29: అవినీతి నిర్మూలన కోసం అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తలపెట్టిన ప్రత్యేక డ్రైవ్‌కు మద్దతుగా చైనాలో ప్రత్యేక జైళ్లను నిర్మిస్తున్నారు. వీటి సంఖ్యను 2017 నుంచి 2024 మధ్య 218కి పెంచినట్టు తాజాగా ‘సీఎన్ఎన్’ ఓ వార్తా కథనం వెలువరించింది. నిందితులను నిర్బంధించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ ఈ జైళ్లను నిర్మించారట.
డిటెన్షన్ కేంద్రాలు లేదా లియుజి సెంటర్లుగా వీటిని పిలుస్తున్నారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, నాయకులు, అధికారులు, బడా వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులు.. ఎవరినైనా డిటెన్షన్ సెంటర్‌కు తీసుకొచ్చి పడేస్తారు. ఆరు నెలల వరకు కుటుంబ సభ్యుల్ని కలుసుకోనివ్వరు. న్యాయ సాయం పొందే అవకాశం ఉండదు.
2012లో అధ్యక్షుడు జిన్‌పింగ్.. సైన్యం, కమ్యూనిస్టు పార్టీ మీద పట్టు సాధించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు ఆరోపణలున్నాయి. 2020 తర్వాత పార్టీతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కూడా విస్తరించారు. ప్రముఖ బ్యాంకర్ బావో ఫాన్, మాజీ సాకర్ స్టార్ లి టైలకు అవినీతి కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష విధించారు.