పిల్లలు ఏదైనా తప్పు చేస్తే.. ముందు నిందించేది వాళ్ల తల్లిదండ్రులనే. పిల్లలను సరిగ్గా పెంచడం చేతకాదా? అని తిడుతుంటారు. పిల్లల మనస్తత్వం ఎలా ఉన్నా.. వాళ్లు చెడిపోయినా.. బాగుపడినా.. చివరకు అనేది తల్లిదండ్రులనే. పిల్లల వల్ల సమాజంలో ఏవైనా సమస్యలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు. అందుకే.. పిల్లలు తప్పు చేస్తే.. ఇక నుంచి వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేస్తామని.. చైనా ప్రకటించింది. దానికి సంబంధించిన కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది.
ఆ చట్టం ప్రకారం పిల్లల్లో ఏవైనా మార్పులు కనిపించినా.. వాళ్లలో చెడు ప్రవర్తన ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ను అందించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బిల్లును చైనా ప్రభుత్వం రివ్యూ చేస్తోంది.
ఆ బిల్లు ప్రకారం.. తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కాసేపు సమయం కేటాయించాలి. సమాజం గురించి చెప్పాలి. సామాజిక బాధ్యత గురించి చెప్పాలి. చట్టాల మీద అవగాహన తీసుకురావాలి. ఇతరులకు సాయం చేసే గుణాన్ని పిల్లల్లో పెంపొందించాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో పాజిటివ్ ఆటిట్యూడ్ ను పెంచేలా చేస్తే భవిష్యత్తులో పెద్దయ్యాక వాళ్ల వల్ల ఎటువంటి నష్టాలు వాటిల్లవు.. అని బిల్లులో పేర్కొన్నారు.
నిజానికి చైనాలో శారీరకంగా పిల్లలను దండించే హక్కు తల్లిదండ్రులకు లేదు. 1986లోనే బ్యాన్ చేశారు. అందుకే.. పిల్లల్లో హింసా ప్రవృత్తి లేకుండా ఉండేలా.. వాళ్లను దండించకుండా వాళ్లకు సరైన విద్యను అందించాలని ఆ బిల్లు చెబుతోంది.
అయితే.. చాలామంది చైనీయులు తమ పిల్లలను శారీరకంగా దండించడం ఎక్కువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పిల్లలపై తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చదువుకోవాలంటూ టార్చర్ పెడుతున్నారు. దాని వల్ల పిల్లల్లో హింసా ప్రవృత్తి పెరుగుతోందని.. అందుకే పిల్లలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్లను సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకే చైనా ప్రభుత్వం ఈ బిల్లను ప్రవేశపెట్టింది.
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగకుండా ఉండేందుకే.. స్కూళ్ల టైమింగ్స్ ను కూడా చైనా ప్రభుత్వం తగ్గించింది. ప్రైవేటు ట్యూషన్లను రద్దు చేసింది. చివరకు ఆన్ లైన్ గేమ్స్ ఆడే సమయాన్ని కూడా కుదించింది. రోజుకు ఒక గంట మాత్రమే ఆన్ లైన్ గేమ్స్ ఆడుకునేలా చర్యలు తీసుకుంది చైనా ప్రభుత్వం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సెల్ఫోన్లు, టవర్లతో ఆరోగ్యం దెబ్బతింటుందా? అసలు రేడియేషన్ అంటే ఏంటి?
Cow Farming : లక్షల జీతం వదిలేసి ఆవు పేడ, మూత్రం అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్న సివిల్ ఇంజనీర్
Aadhar card | మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి