నైరుతి చైనాలోని చోంగ్‌కింగ్‌లో మంగళవారం రాత్రి 11,787 డ్రోన్లతో నిర్వహించిన లైట్ షో ప్రపంచ గిన్నిస్ రికార్డును సృష్టించింది. చోంగ్‌కింగ్ సహజ సౌందర్యం, సంస్కృతి, పట్టణ జీవన శైలి వంటి ఏడు విభాగాల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
‘సిటీ ఆఫ్ మౌంటెయిన్స్ అండ్ రివర్స్’, ‘బ్లూమింగ్ కేమిలియాస్’, ‘డైనమిక్ మెట్రోపోలిస్’ వంటి దృశ్యాలు కనువిందు చేశాయి.