చైనాలో కోవిడ్ లాక్డౌన్.. ఆహార, నిత్యావసరాల కొరత
China Covid lockdowns: చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో తీవ్ర ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30 ప్రదేశాల్లో లక్షలాది మందికి స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రదేశాల్లో పాక్షిక, కొన్ని చోట్ల పూర్తి లాక్డౌన్ అమలులో ఉంది. కనీసం 15 రోజుల నుంచి గోధుమ పిండి, బియ్యం, గుడ్లు లేవని, పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని
జిన్జియాంగ్: చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో తీవ్ర ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30 ప్రదేశాల్లో లక్షలాది మందికి స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా, కొన్ని చోట్ల పూర్తి లాక్డౌన్ అమలులో ఉంది. కనీసం 15 రోజుల నుంచి గోధుమ పిండి, బియ్యం, గుడ్లు లేవని, పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని జిన్జియాంగ్కు చెందిన ఓ వ్యక్తి ఆరోపించాడు. అక్టోబర్‌లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కోవిడ్‌ను నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారం రోజున చైనాలో కొత్తగా 949 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. జిన్జియాంగ్లో కజకస్తాన్ బోర్డర్ వద్ద కొన్ని వారాల నుంచి లాక్డౌన్ అమలులో ఉంది. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

