న్యూయార్క్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో అడ్డుకున్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐసిస్, ఆల్ ఖైయిదా ఆంక్షల కమిటీ కింద ఉగ్రవాది మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఇండియా, అమెరికా ప్రతిపాదన చేశాయి. అయితే ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకున్నది. సెప్టెంబర్ 26 దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు మక్కి సోదరుడవుతాడు. గతంలోనూ పాక్ ఉగ్రవాదులను నిషేధిత జాబితాలో చేర్చుతున్న సమయంలో ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే.
మక్కిని ప్రత్యేకమైన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా చేస్తూ అమెరికా ట్రెజరీ శాఖ 2010 నవంబర్‌లో ప్రకటన చేసింది. దాని ప్రకారం మక్కీ ఆస్తుల్ని సీజ్ చేశారు. అమెరికన్లు ఎవరు కూడా మక్కితో లావాదేవీలు నిర్వహించరాదు. మక్కి తలపై రెండు మిలియన్ల డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది. లష్కరే సంస్థ కోసం నిధులను సమీకరించినట్లు మక్కిపై ఆరోపణలు ఉన్నాయి.