
బీజింగ్: మలేషియా ర్యాపర్ నేమ్వీ పాడిన ఫ్రెజైల్ సాంగ్ ఇప్పుడో సెన్షేషన్. ఇంటర్నెట్లో ఆ పాటకు జనం ఫిదా అవుతున్నారు. ఆసియా దేశాల్లో ఆ సాంగ్ మారుమోగుతున్నది. వైరల్‌గా మారిన ఆ పాటలో మరో స్టార్ సింగర్ చెన్ కూడా ఉంది. అయితే ఆ పాటపై చైనా నిషేధం విధించింది.
పింక్‌తో జాగ్రత్త అంటూ సాగే ఈ పాట ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కానీ చైనాలో మాత్రం ఈ పాట వణుకు పుట్టిస్తోంది. చాలా సాఫ్ట్‌గా రాసినట్లు ఉన్నా.. డ్రాగన్ కమ్యూనిస్టులను టార్గెట్ చేసినట్లు పాట సాగుతోంది. చైనా జాతీయవాదులను తప్పుపడుతున్న రీతిలో ఈ సాంగ్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పాటను చైనాలో బ్యాన్ చేశారు.
ఈ సాంగ్‌కు ఇప్పటికే 3 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. చైనా ప్రభుత్వానికి తొత్తుగా మారిన జాతీయవాదులను ఉద్దేశిస్తూ లిటిల్ పింక్స్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాంగ్ మొత్తం పింక్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. పాటలో కొన్ని పదాలను ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు ఉన్నాయట. ప్రస్తుతం ఈ సాంగ్ తైవాన్, హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో వైరల్ అయ్యింది. ఈ పాటను రాసింది ర్యాపర్ నేమ్వీనే.