Murder : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) ల మధ్య యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ యుద్ధభూమిలో ఉండలేక ప్రశాంతమైన జీవితం కోసం అమెరికా (USA) కు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన్ మహిళ (Ukraine woman) దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మృతురాలిని ఉక్రెయిన్‌కు చెందిన ఇరినా జరుత్స్కాను (23) గా గుర్తించారు. ఆగస్టు 22న నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో ఈ ఘటన జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె వెనుక కూర్చున్న నిందితుడు డెకార్లోస్ బ్రౌన్ జూనియర్ కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నిందితుడు తర్వాతి స్టాప్‌లో దిగిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడికి నేరచరిత్ర ఉందని తెలిపారు.