లండన్, ఏప్రిల్ 17: కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసేందుకు వినియోగించిన ఎంఆర్ఎన్ఏ సాంకేతికత సాయంతో గుండెపోటు రాకుండా నిరోధించనున్నారు. గుండెపోటు వస్తే వారి గుండె కండరాలు తిరిగి పూర్వస్థితికి రావు. గుండెలో నశించిన కణాల స్థానంలో కొత్త కండర కణాలు పుట్టుకొచ్చేలా లండన్లోని కింగ్స్ కాలేజీలోని పరిశోధన బృందం జెనెటిక్ ట్రాకింగ్ అనే సాంకేతికతను అభివృద్ధి పరిచారు. ఇదే సాంకేతికతను ఉపయోగించి మోడెర్నా, ఫైజర్ కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి పరిచాయి. ఎంఆర్ఎన్ఏలను గుండెకు ఇంజెక్షన్ ద్వారా అందిస్తే ఆరోగ్యకరమైన కణాలను పుట్టించే ప్రోటీన్లను గుండె తయరుచేసుకుంటున్నదని పరిశోధకులు చెప్పారు.