Today History : బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
Today History : బొలీవియా అడవులలో క్యూబా విప్లవకారుడు చే గువేరా 1967 లో సరిగ్గా ఇదే రోజున దారుణహత్యకు గురయ్యాడు. 10,000 కిలోమీటర్ల మోటార్‌సైకిల్ ప్రయాణంతో...

(Today History) బొలీవియా అడవులలో క్యూబా విప్లవకారుడు చే గువేరా 1967 లో సరిగ్గా ఇదే రోజున దారుణహత్యకు గురయ్యాడు. 10,000 కిలోమీటర్ల మోటార్‌సైకిల్ ప్రయాణంతో పేదరికాన్ని, ఆకలిని చూసి విప్లవకారుడిగా మారాడు. చే గువేరా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు వ్యతిరేక పోరాటం జరిపిన వ్యక్తిగా చే గువేరా ప్రసిద్ధి చెందారు.
చే గువేరా 1928 జూన్ 14 న అర్జెంటీనాలో జన్మించారు. ఈయన పూర్తి పేరు ఎర్నెస్టో చే గువేరా. ప్రజలు ఆయన్ని చే అని ముద్దుగా పిలుచుకునేవారు. మెడిసిన్ చదివిన చే.. వైద్య వృత్తిని స్వీకరించి జీవితాన్ని హాయిగా గడపకుండా తన చుట్టూ ఉన్న పేదరికాన్ని చూసి, విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. మోటార్ సైకిల్ ద్వారా దాదాపు 10 వేల కిలోమీటర్లు ప్రయాణించి పేదల సమస్యలను ఆకలింపు చేసుకున్నారు. దక్షిణ అమెరికాలోని అనేక దేశాలకు వెళ్లి తీవ్ర పేదరికాన్ని, కార్మికుల దుస్థితిని, పెట్టుబడిదారీ శక్తిని అణచివేయడాన్ని చూశారు.
చే తన ప్రయాణాలపై ఒక డైరీని కూడా వ్రాశారు. అది ఆయన మరణానంతరం ‘ది మోటార్‌సైకిల్ డైరీ’గా ప్రచురితమైంది. పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే పెట్టుబడిదారీ పాలనకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో అతను ఫిడెల్ క్యాస్ట్రోతో భేటీ అయి, క్యూబా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని ప్రతిజ్ఞ చేశారు. గెరిల్లా ఫైటర్ల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని తన ఉద్యమాన్ని క్రమంగా ఊపందుకునేలా చేశారు. 1959 లో క్యూబాలో తిరుగుబాటు చేపట్టారు.
చే-కాస్ట్రోల మధ్య రష్యా, చైనాతో సంబంధాలపై విభేదాలు మొదలయ్యాయి. దాంతో క్యూబాను విడిచిపెట్టి లాటిన్ అమెరికన్ దేశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. అతను కొంతకాలం కాంగోలో ఉండి తర్వాత బొలీవియాకు వచ్చాడు. బొలీవియా అడవుల్లో ఉన్న చే గువేరాను గుర్తించి బొలీవియా పోలీసులు కాల్చి చంపారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2012 : బాలికలకు విద్యపై గొంతెత్తిన మలాలా యూసఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన తీవ్రవాదులు
2006: యూట్యూబ్ కొనుగోలును ప్రకటించిన గూగుల్
2006: ఇజ్రాయెల్ కంపెనీ నుంచి రక్షణ ఒప్పందాల్లో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సమతా పార్టీ చీఫ్ జయ జైట్లీ
2006: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మరణం
2005: యూరోపియన్ ఉపగ్రహం ‘క్రియోశాట్’ ప్రయోగం విఫలం
1998: ఇస్లామిక్ షరియా చట్టాన్ని దేశ అత్యున్నత చట్టంగా చేసిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ
1962: రిపబ్లిక్‌గా మారిన ఆఫ్రికన్ దేశం ఉగాండా
1945: ప్రముఖ సరోద్ ప్లేయర్ అమ్జద్ అలీ ఖాన్ జననం
1920: అలీఘర్‌లోని ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మార్పు
1776: యునైటెడ్ కాలనీ నుంచి యునైటెడ్ స్టేట్స్‌గా అధికారికంగా దేశం పేరును మార్చిన యూఎస్ పార్లమెంట్
ఇవి కూడా చదవండి..
విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

