వాషింగ్టన్, ఫిబ్రవరి 27: చాట్‌జీపీటీ వల్ల వివిధ రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పే సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది. లేట్ చెకౌట్ అనే ఓ డిజిటల్ ఏజెన్సీ ఒక కంపెనీకి డిజైనింగ్ పనులు చేసింది. ఇందుకు ఇవ్వాల్సిన దాదాపు రూ.90 లక్షలు మాత్రం ఆ కంపెనీ చెల్లించలేదు.
డబ్బులు అడిగి విసిగిపోయిన లేట్ చెకౌట్ సంస్థ సీఈవో గ్రెగ్ ఐసెన్‌బర్గ్.. సదరు కంపెనీకి లీగల్ నోటీసు పంపాలనుకున్నారు. ఇందుకు లాయర్ సేవలు తీసుకుంటే రూ.80 వేల వరకు అవుతుంది. దీంతో చాట్‌జీపీటీని ఉపయోగించి ఆయనే ఒక నోటీసును తయారుచేసి ఈమెయిల్ ద్వారా డబ్బులు ఇవ్వాల్సిన కంపెనీకి పంపారు. మరి ఏయే లీగల్ పాయింట్లు లేవనెత్తిందో కానీ, చాట్‌జీపీటీ దెబ్బకు ఆ కంపెనీ డబ్బులు చెల్లించేసింది.