న్యూయార్క్ : చాట్‌జీపీటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నది. పెండ్లి నిర్వహించే మతాధిపతిగా మారి అమెరికాలో నవ దంపతులను ఒక్కటి చేసింది. కొలరాడోలో రీలి అలిసన్ వించ్, డెటాయిన్ ట్రుయిట్ల వివాహానికి పెద్దలు నిశ్చయించారు. వినూత్నంగా ఉండాలని ఆలోచించిన ఆ జంట మతాధిపతికి బదులుగా తమ పెండ్లి చేసే బాధ్యతలను చాట్‌జీపీటీకి అప్పగించారు.
చాట్‌జీపీటీతో పని చేసే ఓ స్పీకర్‌ను రోబోకు అమర్చారు. దీంతో పెండ్లికి వచ్చిన వారిని ఆ చాట్‌జీపీటీ రోబో సాదరంగా ఆహ్వానించింది. అనంతరం వారి పెండ్లి తంతును అంగరంగ వైభవంగా జరిపించింది. దీనికి సంబంధించి పీపుల్ మ్యాగజైన్లో ప్రచురితమైన వార్త వైరల్‌గా మారింది.