కాలిఫోర్నియా: 20-50 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు చాట్జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం పడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచేందుకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పైగా ఇందుకు మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
జీపీటీ-3కి శిక్షణ ఇవ్వడానికే మైక్రోసాఫ్ట్ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. చాట్ జీపీటీకి కోట్ల మంది యూజర్లు ఉన్నందున డాటా సెంటర్లకు భారీగా నీటి వినియోగం ఉంటున్నదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇతర సంస్థల ఏఐ మాడళ్లు కూడా భారీగా నీటిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.