
కార్పొరేట్ ఆన్లైన్ మీటింగ్ల కోసం ఉపయోగించే జూమ్ కాల్తో ఒక కంపెనీ సిఈఓ తన సంస్థలో పని చేసే 900 మంది ఉద్యోగులను ఒకేసారి తీసేశాడు. అమెరికాకు చెందిన గృహ రుణాల తనఖా సంస్థ బెటర్ డాట్ కామ్ సీఈఓ విశాల్ గార్గ్ గత బుధవారం తన కంపెనీ ఉద్యోగులతో జూమ్ కాల్లో మాట్లుడుతూ సంస్థ పనితీరు, సమర్థత ఇతర కారణాల వల్ల 900 ఉద్యోగులను తప్పిస్తున్నట్లు వెల్లడించాడు.
ఆ వీడియో కాల్లో ఆయన తన ఉద్యోగులతో మాట్లాడుతూ.. ” ఇలాంటి వార్తని మీరెవరూ వినాలని కోరుకొని ఉండరు. దురదృష్టవశాత్తూ మీరు కాల్ గ్రూప్లో ఉన్నట్లైతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తున్నాము. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. కానీ మార్కెట్ మందగమనం, కంపెనీ పనితీరు తదితర కారణాల వల్ల సిబ్బందిని తక్షణమే తొలగిస్తున్నాం” అని అన్నాడు. ఇదే వీడియో కాల్లో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. రోజుకు కనీసం 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు 2 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని చెప్పాడు.
విశాల్ గార్గ్ చేసిన వీడియో కాల్ని ఒక ఉద్యోగి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజెన్లు ఆయన ప్రవర్తన పట్ల విమర్శలు చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను ఈ మెయిల్ ద్వారా తొలగించాడు.
Vishal Garg: “I wish I didn’t have to lay off 900 of you over a zoom call but I’m gonna lay y’all off right before the holidays lmfaooo”pic.twitter.com/6bxPGTemEG
— litquidity (@litcapital) December 5, 2021