Nobel Enjoyment |నోబెల్ ప్రైజ్ రావడం అంటే.. ఎంతో కష్టపడాలి. దానికి తోడు అదృష్టం కూడా తోడవ్వాలి. తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుని నోబెల్ అందుకున్న తండ్రీకొడుకుల జాబితాలో పేర్లు లిఖించుకున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా.. ఎంత నోబెల్ ప్రైజ్ గెల్చుకుంటే ఏంటి.. మా దగ్గరైతే అల్లరి పాబోనే అంటూ ఆయన దోస్తులు ఎంజాయ్ చేశారు. ఆయనతో కలిసి ఆడిపాడిన దోస్తులు చివరకు ఆయన్ను అమాంతం ఎత్తి చెరువులో పడేశారు.
ఈ ఏడాది వైద్యశాస్త్రంలో స్వీడన్‌కు చెందిన స్వాంటే పాబో నోబెల్ బహుమతి దక్కించుకున్నాడు. తండ్రి కూడా వైద్యశాస్త్రంలోనే నోబెల్ పొందడంతో పాబోకు ఆనందం అంతా ఇంతా కాదు. తమ దోస్త్ పాబో నోబెల్ అందుకోవడంతో మిగతా దోస్తుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. పాబో స్నేహితులు ఈ విజయాన్ని అపూర్వంగా జరుపుకుని ఆనందడోలికల్లో మునిగిపోయారు.
Our new medicine laureate Svante Pääbo made a splash when his colleagues at @MPI_EVA_Leipzig threw him into a pond. Normally throwing a colleague into the pond happens when somebody receives a PhD, and they wanted to do it for Pääbo's #NobelPrize as well.
Video: Benjamin Vernot pic.twitter.com/SaHAxfwRID
— The Nobel Prize (@NobelPrize) October 8, 2022
నోబెల్ అందుకున్న స్వాంటే పాబోను దోస్తులంతా కలిసి అమాంతం పైకెత్తారు. పక్కనే ఉన్న చెరువులోకి ఎత్తి పడేశారు. కేకలు వేస్తూ పాబోతో తమ ఆనందాన్ని పంచుకుననారు. పాబో కూడా వారితో కలిసి కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. పాబో దోస్తులు ఈ వీడియోను నోబెల్ ప్రైజ్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో తీసినట్లుగా తెలుస్తున్నది.
సాధారణంగా ఎవరైనా స్నేహితుడు పీహెచ్డీ పట్టా పొందిన తర్వాత ఇలా ఎత్తి నీటిలో పడేసి మిగతా దోస్తులు ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు పాబో పీహెచ్డీ వంటి నోబెల్ ప్రైజ్ గెల్చినందుకు అలా ఎత్తి చెరువులో పడేసినట్లుగా స్నేహితులు చెప్తున్నారు.