షికాగో, జూన్ 12 : ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా మంగళవారం షికాగోలోని ఈస్ట్ మన్రో వీధిలో నిరసనకారులపై ఓ కారు దూసువచ్చి, ఫుట్‌పాత్‌పై నిలుచున్న 66 ఏళ్ల మహిళను ఢీకొంది. ఆ మహిళ చేయి విరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆందోళనకారులపైకి దూసుకు వెళ్లేందుకు కారు ప్రయత్నించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దూసుకొస్తున్న కారును చూసి నిరసనకారులు పక్కకు పరుగెత్తగా ఫుట్‌పాత్‌పై వృద్ధురాలు పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళను ఢీకొన్న తర్వాత కారు ఆగకుండా వెళ్లిపోయింది.