మంగళవారం 26 మే 2020
International - Apr 17, 2020 , 08:51:09

99 ఏండ్ల వయసులో 115 కోట్ల సేకరణ

99 ఏండ్ల వయసులో 115 కోట్ల సేకరణ

లండన్‌: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలో పనిచేసిన, 99 ఏండ్ల బ్రిటన్‌ మాజీ సైనికుడు కరోనాపై పోరుకు నడక ద్వారా పెద్దమొత్తంలో విరాళాలు సేకరించారు. కెప్టెన్‌ టామ్‌మూర్‌ ఏప్రిల్‌ 30న వచ్చే తన వందో పుట్టినరోజుకు ముందు 25 మీటర్ల పొడవైన తన గార్డెన్‌లో 100 సార్లు వాకర్‌ సహాయంతో నడిచి బ్రిటన్‌ జాతీయ ఆరోగ్య సేవా స్వచ్ఛంద సంస్థలకోసం వేయి పౌండ్లు (రూ.96,000) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం వందోసారి నడక పూర్తిచేసేసరికి మొత్తం 6,50,000 మంది దాతలు ‘ఫండ్‌రైజింగ్‌' పేజీకి వారంరోజుల్లో 12 మిలియన్ల పౌండ్లు (రూ.115.26 కోట్లు) విరాళంగా ఇచ్చారు. కాగా, ఏప్రిల్‌ 30 వరకు నడక కొనసాగించి, మరిన్ని విరాళాలు సేకరిస్తానని మూర్‌ తెలిపారు. 


logo