ఒట్టావా: కెనడాలో ఓ వ్యక్తి ముస్లింలను టార్గెట్ చేశాడు. తన ట్రక్కుతో ఢీకొట్టిన ఆ ముస్లిం ఫ్యామిలీలో నలుగుర్ని చంపేశాడు. ఈ ఘటన ఒంటారియో ప్రావిన్సులో జరిగింది. ముందస్తుగానే ప్లాన్ వేసి ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రణాళిక ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు. విద్వేషంతో అతను ఆ దాడికి పాల్పడినట్లు తెలిపారు. బాధితులు కేవలం ముస్లింలు కావడం వల్లే వారిని చంపేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు కోలుకుంటున్నాడు. టార్గెట్ చేసి నిందితుడు నెతాన్యుల్ వెల్ట్మాన్ సామూహిక హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అయిదుగురిపై నల్లటి ట్రక్కుతో నిందితుడు ఢీకొట్టాడు.