బీజింగ్: కెనడాకు చెందిన వ్యాపారవేత్త మైఖేల్ స్పావర్కు 11 ఏళ్ల జైలు శిక్షను చైనా విధించింది. గూఢచర్యం ఆరోపణలపై ఆయనకు ఆ శిక్షను ఖరారు చేశారు. అయితే చైనా విధించిన శిక్షను కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఖండించారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. 2018లో స్పావర్ను అరెస్టు చేశారు. చైనా దేశపు రహస్యసాలను చేరవేస్తున్న కేసులో స్పావర్ను దోషిగా తేల్చారు. డాన్డాంగ్ సిటీ కోర్టు ఆ కేసులో ఇవాళ తీర్పునిచ్చింది. మరో వైపు చైనాకు చెందిన మెంగ్ను కూడా కెనడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వాంకోవర్లో ఆ కేసు విచారణ సాగుతున్నది. చైనా విధించిన శిక్షపై స్పావర్ అప్పీల్ చేసుకు అవకాశం కల్పించారు.