ఒట్టావా: సరైన పత్రాలు లేని భారత కార్మికుల పట్ల కెనడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. వీసా గడువు ముగిసినా కెనడాలోనే ఉంటున్న భారత విద్యార్థులు, తాత్కాలిక కార్మికులను దేశ బహిష్కరణ చేస్తున్నారు లేదా వారికి దేశ బహిష్కరణ నోటీసులను జారీ చేస్తున్నారు. ఈ నెల 15న కాల్గరీ ఈవెంట్ సెంటర్ నిర్మాణ స్థలి వద్ద సరైన పత్రాలు లేని నలుగురు కార్మికులను అధికారులు గుర్తించగా, వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. గత నెలలో టొరంటోలోని పీల్ రీజియన్‌లో సరైన పత్రాలు లేని 50 మంది భారతీయులను గుర్తించారు. వీరిలో చాలా మంది పంజాబ్‌కు చెందినవారే.