 
                                                            Canada murder case : కెనడా (Canada) లో మూడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు కెనడా కోర్టు (Canada court) శుక్రవారం తీర్పు చెప్పింది. మూడేళ్ల నాటి ఈ కేసులో మొత్తం ముగ్గురు దోషులుగా తేలారు. వారిలో ఇద్దరు యువకులకు ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారయ్యింది. మూడో దోషి అయిన భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల శిక్ష విధిస్తూ ఇవాళ (శుక్రవారం) కెనడా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
మూడేళ్ల క్రితం అంటే 2022 అక్టోబర్ 17న వాంకోవర్‌లోని గోల్ఫ్ క్లబ్లో విశాల్ వాలియా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కారులో వెళ్తున్న సమయంలో విశాల్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. అనంతరం అతడి కారును తగలబెట్టారు. భారత సంతతికి చెందిన బాలరాజ్ సింగ్ బాస్రా, ఇక్బాల్ కాంగ్, డియాండ్రే బాప్టిస్ట్‌లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
సాక్ష్యాధారాలను మాయం చేసేందుకే వాహనాన్ని తగులబెట్టినట్లు తేలింది. దాంతో బస్రాతో సహా ముగ్గురిని బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు జ్యూరీ దోషులుగా నిర్ధారించింది. వారికి పెరోల్ లేని జైలుశిక్షలు విధించింది.
 
                            