టొరొంటో, సెప్టెంబర్ 28: హెచ్-1బీ వీసా ఫీజులను భారీగా పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కెనడా తనకు అనుకూలంగా మలుచుకునే ఆలోచన చేస్తున్నది. విదేశీ వృత్తి నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానం పలికేందుకు కెనడా ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నే తాజాగా ప్రకటించారు.
లండన్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ‘హెచ్-1బీ వీసాలు పొందినవారిని ఆకర్షించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. నేను దీనిని మరింత సులభతరం చేయబోతున్నా’ అని అన్నారు. విదేశీ వృత్తి నిపుణులకు కెనడాలో ప్రవేశం కల్పించే ప్రతిపాదనలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కార్నే చెప్పారు.