వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. లాస్ ఏంజెల్స్‌కు తూర్పున అటవీ ప్రాంతంలో, నెవాడాలోని ఇక్కడి రీజినల్ పార్క్‌లో చెలరేగిన మంటలు అదుపు తప్పాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భయంకరమైన వేడి గాలులు వీస్తున్నాయి. ఆదివారం కాలిఫోర్నియాలో, నెవాడాలోని వాషూ కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రెనోలో 20వేల మందిని మరోచోటకు తరలించాల్సి వచ్చింది. దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు కృషి చేస్తున్నారని తెలిసింది. రెండు రాష్ర్టాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.