కాబూల్: ఆఫ్ఘన్లో తాలిబన్ల అధికారం మళ్లీ రావడంతో షరియా పేరిట విధించే కఠిన చట్టాలను అక్కడి మహిళలు గుర్తు చేసుకుంటున్నారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లేప్పుడు మహిళలు తప్పనిసరిగా బుర్ఖాను ధరించడం ఈ చట్టంలో ప్రధాన నిబంధన. దీంతో కాబూల్, కాందహార్ తదితర నగరాల్లో బుర్ఖాలకు డిమాండ్ పెరిగిపోవడంతో వాస్తవ ఖరీదు కంటే పది రెట్లు ఎక్కువకు వాటిని విక్రయిస్తున్నారు.