Burkina Faso | పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో (Burkina Faso)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ చర్చి (Catholic church)పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
మాలి సరిహద్దుకు సమీపంలోని ఔడలాన్ ప్రావిన్స్ (Oudalan province)లోని ఎస్సాకనే (Essakane) గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనల కోసం చర్చికి వచ్చారు. ఆ సమయంలో చర్చిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు (terrorist attack). ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read..
Israeli embassy | ఇజ్రాయెల్ ఎంబసీ ఎదుట.. అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
Texas | అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు