Banana | లండన్: తోలు తీసిన తర్వాత కూడా అరటిపండు 24 గంటలపాటు తాజాగా ఉండేట్టు చేయటంలో బ్రిటిష్ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. జన్యుపరమైన మార్పులు చేయటం ద్వారా కొత్త రకం అరటిపండును ఆవిష్కరించినట్టు వారు పేర్కొన్నారు. సాధారణ అరటిపండుతో పోల్చితే, జన్యు మార్పులు చేసిన అరటిపండు రుచి, కమ్మదనం, రంగులో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు.
తోలు తీసిన అరటిపండు లేదా ముక్కలుగా కోసిన తర్వాత కూడా దాని రుచి, రంగు, రూపం 24 గంటలపాటు అలాగే కొనసాగుతుందని చెప్పారు. సాధారణంగా అరటిపండు తోలు తీసిన తర్వాత వెంటనే మగ్గిపోతుంది. దానిని ఎక్కువ సమయం నిల్వ చేయలేం. సైంటిస్టులు కనుగొన్న కొత్త రకం అరటిపండ్ల అమ్మకాలు ఇదే నెలలో అమెరికా, కెనడా, ఫిలిప్పీన్స్, కొలంబియా దేశాల్లో మొదలవుతాయి.