లండన్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. బుధవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్ ఆయన్ను సన్మానించింది. బెంగాలీ అయినందుకు బ్రిటీష్ పార్లమెంట్ తనను సత్కరించినట్లు ఓ వార్తా సంస్థతో గంగూలీ తెలిపారు. పార్లమెంట్లో ఆ సత్కారం జరిగిందని, దీని గురించి ఆరు నెలల క్రితమే తనను కాంటాక్ట్ అయినట్లు చెప్పారు. ప్రతి ఏడాది ఈ అవార్డును ఇస్తుంటారని, తనకు ఈసారి దక్కినట్లు గంగూలీ తెలిపారు. అయితే 20 ఏళ్ల క్రితం జూలై 13వ తేదీనే గంగూలీని బ్రిటీషర్లు సన్మానించారు. 2002లో జరిగిన నాట్‌వెస్ట్ ఫైనల్లో గంగూలీ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఆ సందర్భంగా అప్పుడు సౌరవ్‌ను సత్కరించారు.