Breaking : హాంకాంగ్ (Hong Kong) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. థాయ్ పొ (Thai po) నగర సమీపంలోని అపార్టుమెంట్ల సముదాయంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు అగ్నిమాపక దళానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. మిగతా వారిలో 8 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు.
అపార్టుమెంట్ల సముదాయం చుట్టూ వెదురు బొంగులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, దానికి గ్రీన్ నెట్ తగిలించారని, ఆ ఫెన్సింగ్ మంటలు అంటుకుని మొత్తం నాలుగు బ్లాకులకు చుట్టుకున్నాయని అధికారులు తెలిపారు. మంటల్లో కాలిపోయి గ్రీన్ నెట్ జారిపోయిందని చెప్పారు. అపార్టుమెంట్ల లోపల ఇంకా వందల మంది ఉన్నారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయిని వెల్లడించారు.
Major fire has broken out in multiple buildings at Wang Fuk Court in Tai Po, Hong Kong 🇭🇰 (26.11.2025) pic.twitter.com/ZUkCsbFJaG
— Disaster News (@Top_Disaster) November 26, 2025