శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 13:35:40

కరోనా విలయం : బ్రెజిల్లో మృత్యుఘోష

కరోనా విలయం : బ్రెజిల్లో మృత్యుఘోష

బ్రెసిలియ : బ్రెజిల్లో కరోనా విలయం సృష్టిస్తోంది. నిత్యం ఆ దేశంలో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతోపాటు మరణాల సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆదేశంలో కొత్తగా 20,286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 733 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో 1.8 మిలియన్ల మంది కరోనా బారినపడగా 1.1 మిలియన్ల మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 72,833 మంది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ కారణంగా మృతి చెందినట్ల ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.  ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక కరోనా మరణాలు సంభవించింది బ్రెజిల్‌లోనే. 


logo