బసిలియా : పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసుల్లో పెరుగుదల నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా తాము ఆ వ్యాధి నియంత్రణకు సింగిల్ డోస్ టీకాకు ఆమోదం తెలిపామని బ్రెజిల్ అధికారులు బుధవారం తెలిపారు. బుటటన్-డివిగా పిలిచే ఈ వ్యాక్సిన్ను 12-59 ఏండ్ల వయసు గల వారి కోసం రూపొందించామని ఆ దేశ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్విసా తెలిపింది.
డెంగ్యూ లక్షణాలకు వ్యతిరేకంగా ఈ టీకా 74.7 శాతం సామర్థ్యంతో పని చేసిందని సీఎన్ఎన్ బ్రెజిల్ నివేదించింది. అంటే ఈ వ్యాధి వచ్చిన ప్రతి నలుగురిలో ముగ్గురికి రక్షణ లభించింది. ఈ రక్షణ గతంలో ఈ వ్యాధి బారిన పడిన వారికి, పడని వారికి ఒకే విధంగా ఉంది.