ఇస్లామాబాద్ : ఓ చిన్నారి అద్భుత బ్యాటింగ్ విన్యాసాలతో కూడిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. పాకిస్తాన్‌కు చెందిన బాలుడు అలవోకగా షాట్లు ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ వైరల్ వీడియోను రజ మహర్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌లో రజా మేనల్లుడు చిచ్చరపిడుగులా చెలరేగి అలరించే షాట్లతో బ్యాటింగ్ నైపుణ్యాలు కనబరిచాడు.
టీ షర్ట్, క్యాప్ ధరించిన బాలుడు ప్రతి బంతిని ఎంతో ఈజ్‌తో భారీ షాట్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ పోస్ట్‌కు పవర్ హిట్టింగ్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 1.8 కోట్ల మంది పైగా వీక్షించారు.
చిన్నారి మేనల్లుడు, లిటిల్‌మాస్టర్ స్టన్నింగ్ బ్యాటింగ్ స్కిల్స్‌తో కూడిన పలు ఇతర వీడియోలను కూడా రజా షేర్ చేశారు. ధోని ఫేమస్ హెలికాఫ్టర్ షాట్‌ను కూడా ఓ క్లిప్‌లో చిన్నారి అద్భుతంగా ఆడటం ఆకట్టుకుంటుంది.
Read More
మంచు కరిగి.. జీవానికి సవాలు విసిరి!