లండన్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిటన్ జాతీయులకు సంబంధించి అవశేషాలను గుర్తించటంలో పొరపాట్లు జరిగాయని తెలిసింది! దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆ మృతదేహాల అంత్యక్రియల్ని రద్దు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 12న జరిగిన ఈ ప్రమాద ఘటనలో మొత్తం 53 మంది బ్రిటన్ జాతీయులు మరణించగా, వారి అవశేషాలకు అహ్మదాబాద్ దవాఖానలో డీఎన్ఏ పరీక్షలు జరిపారు.
అనంతరం సీల్ చేసిన శవపేటికల్లో భారత నుంచి బ్రిటన్కు పంపారు. అయితే ఇందులో రెండు మృతదేహాలు తారుమారు అయినట్టు బాధిత కుటుంబాల తరఫు న్యాయవాది ఆరోపిస్తున్నారు. అవశేషాలను గుర్తించి బ్రిటన్కు పంపటంలో తప్పులు జరిగాయని అన్నారు.