ఇస్లామాబాద్: తాము 17 మంది పాకిస్థాన్ సైనికులను నిర్బంధించినట్టు పాకిస్థాన్‌లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఆదివారం ప్రకటించింది. అనంతరం 10 మందిని విడుదల చేస్తూ మిగిలిన ఏడుగురిని విడుదల చేయడానికి ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని వారంలోగా చేసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇది ఆపరేషన్ హరాఫ్ రెండో దశ అని బీఎల్ఏ మీడియా వింగ్ హక్కాయ్ అధికార ప్రతినిధి జీయంద్ బలూచ్ పేర్కొన్నారు. నిర్బంధంలో ఉన్న మిగిలిన ఏడుగురు పాకిస్థాన్ ఆర్మీ రెగ్యులర్ యూనిట్‌కు చెందిన వారు. వారిపై బలూచ్ జాతీయ కోర్టులో వివిధ ఆరోపణలపై విచారణ జరిగింది.