లండన్: కొవిడ్ బారిన పడిన ఆ మహిళ దాదాపు 7 వారాల పాటు కోమాలో ఉన్నది. అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న ఆమె కోమాలోనే పాపకు జన్మనిచ్చింది. కోమా నుంచి బయట పడ్డ తర్వాత తాను బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుసుకొని తన పాపను దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉద్వేగానికి లోనైంది. బ్రిటన్‌కి చెందిన లారా వార్డ్.. గర్భిణిగా ఉన్న సమయంలో కరోనా సోకింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రసవం గడువు తేదీ కంటే 2 వారాల ముందే వైద్యులు ప్రసవం చేశారు.