న్యూయార్క్, ఏప్రిల్ 29: బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే హెచ్5 వైరస్ అమెరికాలోని కొలరాడో రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తికి సోకినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. అమెరికాలో వ్యక్తికి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకడం ఇదే తొలిసారి. ఆ వ్యక్తి పౌల్ట్రీలో పని చేస్తుండే వాడని, వాటి నుంచే అతడిని సోకి ఉండొచ్చని చెబుతున్నారు. ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఇది మనుషుల నుంచి మనుషులకు నేరుగా వ్యాపించే ప్రమాదమేమీ లేదని సీడీసీ వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద ఇది రెండో కేసని, తొలి కేసు బ్రిటన్‌లో 2021 డిసెంబర్లో వెలుగులోకి వచ్చిందని తెలిపింది.