బ్రసెల్స్, డిసెంబర్ 21: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐరోపా దేశాలు ఈ ఏడాది తీవ్రస్థాయిలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని చవిచూశాయి. 2021, అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య 37 యూరోపియన్ దేశాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో 2,500 సార్లు బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని గుర్తించినట్టు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ(ఈఎఫ్ఎస్ఏ), యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పేర్కొన్నాయి. ఈ ఏడాది కాలవ్యవధిలో ప్రభావిత పౌల్ట్రీ ఫారాల్లో దాదాపు 5 కోట్ల పక్షులను హననం చేశారని, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తుగా వధించిన కోళ్లు, బాతులు, టర్కీలను ఇందులో చేర్చలేదని ఈఎఫ్ఎస్ఏ తెలిపింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ సాధ్యాసాధ్యలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.