న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవ సంరంభ వేళ .. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య, డిజిటల్ రంగంలో జరుగుతున్న మార్పుల వల్లే భారత్ అభివృద్ధిలో దూసుకువెళ్తున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి కంగ్రాట్స్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆరోగ్య, డిజిటల్ రంగాలకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ రెండు రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతి అనన్యసామాన్యమైందని, ఆ జర్నీలో తాము భాగస్వామ్యులు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు బిల్ గేట్స్ తెలిపారు.
As India celebrates its 75th Independence Day, I congratulate @narendramodi for prioritizing healthcare and digital transformation while spearheading India’s development. India's progress in these sectors is inspiring and we are fortunate to partner in this journey #AmritMahotsav
— Bill Gates (@BillGates) August 15, 2022