ఇస్లామాబాద్ : ఉత్తర పాకిస్థాన్‌లోని సియాల్కోట్లోని సైనిక స్థావరంలో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వినిపించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో పేలుడు శబ్ధం వినిపించినట్లు సమాచారం. ఆ తర్వాత ఘటనపై పాక్ ఆర్మీ మీడియా విభాగం ప్రకటన విడుదల చేసింది. ప్రమాదవశాత్తు మిలటరీ బేస్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పేర్కొంది.
ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సియాల్కోట్ గారిసన్ సమీపంలోని మందుగుండు సామగ్రి షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా స్పందించి మంటలను అదుపు చేయడంతో ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పేలుడుకు సంబంధించిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. సైనిక స్థావరం వద్ద భారీగా మంటలు ఎగిసిపడుతున్న, పొగ వ్యాపించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
Something is Happening in #Sialkot
Cant #Sialkot pic.twitter.com/UsZ97NhW7M— MariA RazAa (@RazaaMaria) March 20, 2022