US Bans Russia | వొడ్కా.. సీఫుడ్ నిషేధం.. రష్యాపై అమెరికా ఆంక్షలు కఠినం!
US Bans Russia | రష్యా నుంచి అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది. రష్యా నుంచి వొడ్కా, సీఫుడ్, డైమండ్స్ దిగుమతిని నిషేధించింది.
US Bans Russia | ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా రష్యా నుంచి సీఫుడ్, వొడ్కా, డైమండ్స్ దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యా నుంచి పలు రకాల వస్తువుల దిగుమతిపై నిషేధం అమల్లోకి తెస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, అమెరికా, దాని జీ-7 దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు రష్యాకు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత సానుకూల దేశం) అన్న హోదాను తొలగించేశాయి. దీనివల్ల రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెరుగుతాయి.
తత్ఫలితంగా రష్యా తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతుందని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్ర దేశాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- EU
- g-7
- Russia Invansion
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

