ఐఎస్ఐస్ అగ్రనేత అబు ఇబ్రహీమ్ అల్ ఖురేషీని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ స్వయంగా వెల్లడించారు. ఐఎస్ఐఎస్ అగ్రనేత అల్ ఖురేషీ లక్ష్యంగా కౌంటర్ టెర్రరిజమ్ దళాలు నార్త్ వెస్ట్ సిరియాలో దాడులు నిర్వహించాయని, ఈ దాడుల్లోఅల్ ఖురేషీని మట్టుబెట్టాయని జోబైడెన్ ప్రకటించారు. అయితే ఈ దాడిలో అమెరికా సైనికులు క్షేమంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ఎంతో ధైర్య సాహసాలతో ఈ దాడులకు అమెరికా దళాలు పూనుకున్నాయని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని జోబైడెన్ పేర్కొన్నారు. ‘మా సాయుధ దళాల నైపుణ్యానికి, ధైర్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐఎస్ఐఎస్ అగ్రనేత అల్ఖురేషీని అమెరికన్ దళాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్లో పాల్గొన్న అమెరికా సైనికులందరూ తిరిగి క్షేమంగా తిరిగి వచ్చారు’ అని అమెరికన్ ప్రెసిడెంట్ జోబైడెన్ పేర్కొన్నారు.