ఆసియా ఏనుగుల్లో అత్యంత పొడవైన దంతాలు కలిగిన భోగేశ్వర (70) ఏనుగు కన్నుమూసింది. సహజ కారణాల వల్లే ఆదివారం ఏనుగు మరణించినట్టు కర్ణాటక అటవీ శాఖ అధికారులు తెలిపారు. భోగేశ్వర క్యాంప్ పరిసరాల్లో తిరుగుతుండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. మిస్టర్ కబిని అని కూడా పిలుస్తారు. భోగేశ్వర దంతాల పొడవు 2.54 మీటర్లు, 2.34 మీటర్లు. సహజ కారణాలతో మృతిచెందడంతో ఏనుగు కళేబరాన్ని రాబందులకు ఆహారంగా విడిచిపెట్టినట్టు అధికారులు తెలిపారు. కబినికి వన్యప్రాణి ప్రేమికులు అంతిమ వీడ్కోలు పలికారు.